యూట్యూబ్‌లో ప్రధాని మోదీ రికార్డ్

యూట్యూబ్‌లో ప్రధాని మోదీ రికార్డ్

యూట్యూబ్‌లో ప్రధాని మోదీ రికార్డ్వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ: భారత ప్రధాని మోదీ మరో రికార్డు సృష్టించారు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో ప్రధాని సబ్‌స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్‌లు దాటింది. ప్రపంచ నేతలలో అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లు కలిగిన రాజకీయ నేతగా తన స్థానాన్ని మరింత పదిలపరచుకున్నారు. రెండో స్థానంలో బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోలిస్తే ప్రధాని మోదీ ఏడు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నారు.