గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి సినీ హీరో వేణు

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి సినీ హీరో వేణు తొట్టెంపూడి గురువారం ఉదయం మాదాపూర్ లో తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటారు.

గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించి సినీ హీరో వేణుపచ్చదనాన్ని పెంచేందుకు గ్రీన్ చాలెంజ్ పేరుతో జరుగుతున్న మహా ప్రయత్నంలో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని వేణు ఈ సందర్భంగా అన్నారు. కాగా, వేణు పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ చాలెంజ్ ను స్వీకరంచి మొక్కలు నాటినందుకు అభినందనలు తెలిపారు.