గుడ్‌న్యూస్: కరోనాకు మందు వచ్చేసింది
వరంగల్ టైమ్స్, ముంబై: కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిన్ను ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. ఫాబిఫ్లూ పేరుతో యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ మందును స్వల్ప నుంచి మధ్యస్థాయి లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించవచ్చని పేర్కొంది.ముంబయికి చెందిన ఈ సంస్థ ఫాబిఫ్లూ తయారీ, మార్కెటింగ్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి శుక్రవారం అనుమతులు పొందింది. కరోనాకు చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే ఔషధాల్లో ఆమోదం లభించిన మొదటి డ్రగ్ ఫాబిఫ్లూనేనని సంస్థ పేర్కొంది. “దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరైన సమయంలో ఔషధానికి ఆమోదం లభించింది. ఈ ఔషధంతో సమర్థమైన చికిత్స అందించవచ్చు. ఫలితంగా ఈ ఒత్తిడిని తగ్గించవచ్చు.” అని గ్లెన్ సల్దానా, గ్లెన్‌మార్క్ ఛైర్మన్, ఎండీ తెలిపారు.