బండ్ల గణేశ్ కు కరోనా

హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా సోకడంతో, టాలీవుడ్ అలర్ట్ అయింది. గత రెండు రోజులుగా బండ్ల గణేశ్ కు కరోనా సోకినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తుండగా, తనను బండ్ల గణేశ్ కు కరోనాసంప్రదించిన మీడియా ప్రతినిధులకు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారట. అపోలో లేదా కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరనున్నానని, ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బండ్ల గణేశ్ హెయిర్ ప్లాంటేషన్ నిమిత్తం వెళ్లగా, అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్ కరోనా టెస్ట్ కు రిఫర్ చేశారట. ఆ వెంటనే బండ్ల గణేశ్ కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ గా తేలింది.