ప్రవేశాల గడువు పెంపు

ప్రవేశాల గడువు పెంపుహైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2020-21 విద్యాసంవత్సరానికి డిగ్రీలో ప్రవేశాల గడువును మరోమారు పొడిగించింది. వర్సిటీ అందిస్తున్న వివిధ కోర్సుల్లో చేరడానికి ఈనెల 17 వరకు అవకాశం కల్పించింది. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందడానికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైనవారు, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ పాసైన విద్యార్ధులు www.braou.ac.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజు చెల్లించవచ్చు.