హైదరాబాద్ : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. 35వేలకుపైగా ఖాళీలతో ఎన్టీపీసీ నోటిఫికేషన్ ను ఆర్ఆర్బీ విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు డిసెంబర్ 28న ప్రారంభమై వచ్చే యేడాది మార్చి వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోసం ఆర్ఆర్బీ మాక్ టెస్టులు నిర్వహిస్తున్నది. ఇవి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో ఈ పరీక్షలు రాయవచ్చని తెలిపింది. పరీక్షలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనుంది. పరీక్ష కేంద్రాలు, తేదీ, సమయం వంటి వివరాలతో కూడిన షెడ్యూల్ ను అందులో పేర్కొననుంది. విడుతల వారీగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడుత 2021, జనవరి 13తో ముగుస్తుంది.