రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : అమిత్ షా

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : అమిత్ షానిర్మల్ జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలనా విధానాన్ని, కేసీఆర్ నిరంకుశ పాలనను ఈ సభా ముఖంగా అమిత్ షా ఎండగట్టారు.

తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతుందంటూ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు చేసిన అమిత్ షా, సీఎం కేసీఆర్ మజ్లిస్ పార్టీకి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో అధికారం కారుదే అయినా… స్టీరింగ్ మాత్రం మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కానేకాదని అమిత్ షా అన్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ ఊసే లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమన్నారు.రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : అమిత్ షాతెలంగాణలో బీజేపీ బలం అంతకంతకూ పెరుగుతోందన్నారు. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచామనీ, ఈ సారి మొత్తం సీట్లు బీజేపీయే గెలుస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రపై అమిత్ షా ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో కుటుంబపాలనను అంతమొందించడమే సంగ్రామ యాత్ర లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వాన్ని మరింత బలపర్చాలని కోరారు. హుజురాబాద్ లోనూ బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.