హోం క్వారంటైన్‌లో స‌ల్మాన్‌

హోం క్వారంటైన్‌లో స‌ల్మాన్‌ముంబై: బాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు స‌ల్లుబాయ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. త‌న వ్య‌క్తిగ‌త డ్రైవ‌ర్ అశోక్‌తోపాటు ఇద్ద‌రు సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో స‌ల్మాన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. క‌రోనా చైన్‌ను విచ్ఛిన్నం చేయ‌డానికి త‌న‌తోపాటు కుటుంబ స‌భ్యులంతా 14 రోజుల‌పాటు హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కరోనా బారిన పడిన తన సిబ్బందికి సల్మాన్ ముంబైలోని ద‌వాఖాన‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా, త‌న త‌ల్లిదండ్ర‌లు స‌లీంఖాన్‌, స‌ల్మా ఖాన్‌ల వివాహ వార్షికోత్సవ వేడుక‌ల‌ను క‌రోనా వ‌ల్ల‌ ర‌ద్దు చేశారు. స‌ల్మాన్‌కు ప్ర‌స్తుతం ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోనున్నారు. అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికార‌కంగా ధృవీక‌రించాల్సి ఉన్న‌ది.