ఇంటర్‌ అడ్మి‌షన్లు ఈ నెల 30 వరకు

ఇంటర్‌ అడ్మి‌షన్లు ఈ నెల 30 వరకుహైద‌రా‌బాద్: రాష్ట్రంలో ఇంటర్‌ అడ్మి‌షన్ల గడువు తేదీని తెలంగాణ ఇంట‌ర్మీ‌డి‌యట్‌ బోర్డు మరో‌సారి పొడి‌గిం‌చింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 16తో గ‌డువు ముగి‌సింది. అయితే ప‌దోత‌ర‌గ‌తి పాసైన విద్యా‌ర్థు‌లం‌ద‌రికీ ఇంట‌ర్‌లో అడ్మి‌షన్లు కల్పిం‌చా‌లనే ఉద్దే‌శం‌తో గడువు తేదీని ఈ నెల 30 వరకు పొడి‌గిం‌చింది. రాష్ట్రంలో 1,300 ప్రైవేటు జూని‌యర్‌ కాలే‌జీలు ఉండగా.. ఇప్ప‌టి‌వ‌రకు 700 కాలే‌జీ‌లకు అఫి‌లి‌యే‌షన్లు ఇచ్చారు. అఫి‌లి‌యే‌షన్‌ నిబం‌ధ‌నల డాక్యు‌మెంట్లు సమ‌ర్పిం‌చని 500 కాలే‌జీల అఫి‌లి‌యే‌షన్లు నిలి‌పి‌వే‌సి‌నట్టు బోర్డు అధి‌కా‌రులు తెలి‌పారు. అఫి‌లి‌యే‌షన్లు పొంద‌డా‌నికి కాలే‌జీ‌లకు కూడా మరో 15 రోజులు గడువు పెంచ‌ను‌న్నామని బోర్డు అధికారులు తెలిపారు.