మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీకి రాహుల్ నివాళుల‌ు

మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీకి రాహుల్ నివాళుల‌ున్యూఢిల్లీ: మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ 103వ జ‌యంతి సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళుల‌ర్పించారు. ఇవాళ ఉద‌యం ఢిల్లీలోని శ‌క్తిస్థ‌ల్‌లో ఉన్న‌ నాన‌మ్మ ఇందిరాగాంధీ స‌మాధి వ‌ద్ద ఆయ‌న శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ‘మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తున్నాను. అధికారానికి ప్ర‌తిరూప‌మైన ఆమె సమర్థవంతమైన ప్రధానమంత్రి. ఆమె నాయ‌క‌త్వ ప‌టిమ గురించి దేశం మొత్తం ఇప్ప‌టికీ మాట్లాడుతున్న‌ది. నాన‌మ్మ‌గా త‌న‌ను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆమె నేర్పించిన విషయాలు త‌న‌ను ప్రతిరోజూ ప్రేరేపిస్తాయ‌ని’ ట్వీట్ చేశారు.