మంత్రి సత్యవతికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

మంత్రి సత్యవతికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

వరంగల్ టైమ్స్ , మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ రెండ్రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పరామర్శించారు. లింగ్యా నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.