బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : పరకాల మండలం పోచారం గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే సూచించారు. వర్షం వచ్చిందంటే చాలు వరద నీటి ప్రవాహం వల్ల పోచారం గ్రామంలో ప్రజల రాకపోకలు నిలిచిపోయేవని ఎమ్మెల్యే గుర్తుచేశారు.బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చల్లాచుట్టూరా ఉన్న గ్రామాలకు ప్రధాన సమస్యగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే రూ.5కోట్ల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేపించినట్లు చల్లా ధర్మారెడ్డి తెలిపారు. త్వరలోనే బ్రిడ్జి పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఒక ప్రణాళికతో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ , టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ కోరె రమేష్ తదితరులు పాల్గొన్నారు.