శనీశ్వరుడి విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చా..!!
వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కో దేవుడిని పూజిస్తారు. శనీశ్వరుడిని శనివారం పూజిస్తారు. శనివారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల చెడు దృష్టి నుంచి బయటపడతామనే విశ్వాసం ఉంది. శని సాడే సతి, శని ధైయ్య ప్రభావం కూడా తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. శని దేవుడిని పూజించడం ఉత్తమం అని గ్రంథాలలో పేర్కొన్నప్పటికి, శని విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అశుభంగా భావిస్తారు. శని దేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదో తెలుసుకుందాం.
*శనీశ్వరుడి భార్య చేసిన శాపం*
ఒకసారి శనీశ్వరుడు ధ్యానంలో మునిగిపోయినప్పుడు అతని భార్య తన అందంతో అతన్ని ఆకర్షించడానికి ప్రయత్నించింది. కానీ ధ్యానంలో కూర్చున్న శనీశ్వరుడు ఒక్కసారి కూడా ఆమెను చూడలేదు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. దీంతో శనీశ్వరుడు ఎవరినైనా చూస్తే వారికి శని పట్టుకుంటుందని శపించింది.
*ఇంట్లో శనీశ్వరుడి విగ్రహం*
గుడిలో దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు మనం దేవుడిని చూస్తూ కళ్లు మూసుకుని ప్రార్థిస్తాము. అయితే శనిదేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచినట్లయితే శని దృష్టితో కంటికి కనిపించడం అశుభంగా భావిస్తారు. శనిదేవుని వక్ర దర్శనం వల్ల ఇంట్లోనే కాకుండా గుడిలో కూడా దర్శనం సమయంలో మనం కళ్లు దించుకుని ప్రార్థించాలి. దీని ద్వారా శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. శనీశ్వరుడి కోపానికి మనం గురికాము. కాబట్టి శని దేవుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకపోవడానికి ఇదే కారణం