సీఎం జగన్​ డీపీ ఆవిష్కరణ

సీఎం జగన్​ డీపీ ఆవిష్కరణతిరుపతి : సీఎం వైఎస్​ జగన్​ జన్మదినోత్సవం సందర్భంగా డాలర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో కామన్ డీపీ(సీడీపీ)ని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. శుక్రవారం హోటల్ గ్రాండ్ రిడ్జ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 21న సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధిష్టానం సీడీపీ తయారీ, ఆవిష్కరణ బాధ్యతలను తిరుపతికి చెందిన డాలర్స్ గ్రూప్ కు అప్పగించింది. ” హ్యాపీ బర్త్ డే జగనన్న” శీర్షికన సీడీపీ ని ఆకర్షణీయంగా రూపొందించారని చెవిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డిని చెవిరెడ్డి అభినందించారు. ఈ సీడీపీ ఐదు బాషల్లో తెలుగు, ఇంగ్లిష్, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రూపొందించి విడుదల చేసినట్లు దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.