తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ (72) కన్నుమూశారు. 72 ఏళ్ల వయసు ఉన్న సూర్యనారాయణ.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుడిశ్వాస విడిచారు.తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదంఈ ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చిందని, ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే చనిపోయారని కుటుంబీకులు తెలిపారు. సూర్యనారాయణ అనేక నాటకాలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఇటీవల కూడా ఆయన కొన్ని సీరియల్స్ లో నటించినట్లుగా తెలుస్తోంది. సూర్యనారాయణ మృతి పట్ల పలువురు టీవీ సిరియల్స్ నటులు, టెక్నీషియన్స్ సంతాపం తెలిపారు.