అమెరికా మాజీ అధ్యక్షుడు ఓబామాకు కరోనా 

అమెరికా మాజీ అధ్యక్షుడు ఓబామాకు కరోనా

వరంగల్ టైమ్స్, వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఒబామా స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు. గత రెండ్రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నానని వెల్లడించారు. తన సతీమణి విచెల్ కి నెగెటివ్ వచ్చిందని చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఓబామాకు కరోనా తాను బూస్టర్ డోసు కూడా వేసుకున్నానని పేర్కొన్నారు. ‘నాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. రెండ్రోజులుగా గొంతులో నొప్పిగా ఉంది, అయితే ప్రస్తుతం బాగానే ఉన్నాను. మిచెల్, నేను టీకాలు, బూస్టర్ డోసులు వేసుకున్నాం. పరీక్షలో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా టీకాలు తీసుకోని వారికి వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలి’ అని ఒబామా ట్వీట్ చేశారు.