టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనాహైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో కొవిడ్ బారినపడినట్లు మహేష్ బాబు ట్వీట్ ద్వారా తెలిపారు. దీంతో మహేష్ బాబు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. “కొవిడ్ నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా నుంచి తప్పించుకోలేకపోయా, ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి.

ఇంట్లోనే ఐసోలేట్ అయ్యాను. అలాగే డాక్టర్లను సంప్రదించా, వాళ్ల గైడెన్స్ ను ఫాలో అవుతున్నా.. గత కొన్ని రోజుల నుంచి నన్ను కలిసిన వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోండి. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్లు ఖచ్ఛితంగా తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకుంటే, కరోనా తీవ్రతను చాలావరకు తగ్గించవచ్చు. కొవిడ్ రూల్స్ ను పాటించండి.

సేఫ్ గా ఉండండి అంటూ “మహేష్ బాబు ట్వీట్ చేశారు. అయితే ఇటీవలే మహేష్ బాబుతన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ కు వెళ్లొచ్చారు. నూతన సంవత్సరానికి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో వెల్ కమ్ చెప్పారు. ఆ ట్రిప్ కు వెళ్లొచ్చిన కొద్ది రోజులకే ఆయనకు కరోనా సోకింది.