కాళేశ్వరం ప్రాజెక్టు లో అపశృతి

కాళేశ్వరం ప్రాజెక్టు లో అపశృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లో అపశృతి నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన కన్నేపల్లి పంపుహౌస్ లో మూడవ టీఎంసి నీరందించడానికి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో అపశృతిక్రేన్ ద్వారా తాపీ మెస్ర్తీ లు పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగి పైనుండి కిందకి పడడంతో ఏడుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన మహాదేవపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచకు చెందిన వారు. ఎంజీఎంలో చికిత్స అనంతరం అధికారులు వీరిని స్వగ్రామం సిరొంచకు తరలించారు.