విశాఖలో సీఎం జగన్ పర్యటన..షెడ్యూల్ రిలీజ్

విశాఖలో సీఎం జగన్ పర్యటన..షెడ్యూల్ రిలీజ్

 

వరంగల్ టైమ్స్, విజయవాడ : ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి 3 రోజుల పాటు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ నేడు విడుదలైంది. మార్చి 2న సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి సాయంత్రం 5.15 ని.లకు విశాఖ చేరుకుంటారు.విశాఖలో సీఎం జగన్ పర్యటన..షెడ్యూల్ రిలీజ్రాత్రి అక్కడే బస చేస్తారు. మార్చి 3న ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొంటారు. రాత్రి 8 గం.ల నుంచి 9 గం.ల మధ్య ఎంజీఎం పార్క్ హోటల్ లో జీఐఎస్ డెలిగేట్స్ కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మార్చి 4న ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.