ఏపీ సీఎంకు రాంగోపాల్ వర్మ ట్వీట్

ఏపీ సీఎంకు రాంగోపాల్ వర్మ ట్వీట్హైదరాబాద్ : డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ట్వీట్ చేశారు. “వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం, జగన్ ను మిగిలిన నేతలు మిస్ లీడ్ చేస్తున్నారు, వారికి అనుగుణంగా జగన్ ను వాడుకుంటున్నారు.. జగన్ గారు మీ చుట్టూ వున్న వారితో జాగ్రత్త..”అంటూ వర్మ ట్వీట్ చేశారు.

అయితే ఏపీలో సినిమా టికెట్ల వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో మంత్రి పేర్ని నానికి ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయాలను, ప్రశ్నలను వర్మ సంధించిన విషయం తెలిసిందే.

వర్మ ప్రశ్నలకు కొన్నింటికి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని ఏకంగా వర్మను ముఖాముఖాకి ఆహ్వానించారు. ఇదిలా వుండగా రాంగోపాల్ వర్మ ఏకంగా సీఎం వైఎస్ జగన్ పై తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.