తెలంగాణలో కరోనా రికవరీ రేటు 94.13%

తెలంగాణలో కరోనా రికవరీ రేటు 94.13%హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 95,355 నమూనాలను పరీక్షించగా 3,590 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,58,566కి పెరిగింది. తాజాగా మహమ్మారి బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 3,555 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,14,034 మంది కరోనా నుంచి బయటపడినట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. మరో 40,447 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 94.13 శాతంగా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 1160 మందికి పాజిటివ్‌గా తేలింది.