బాపూ ఘాట్ లో మహాత్మునికి ఘన నివాళులు

బాపూ ఘాట్ లో మహాత్మునికి ఘన నివాళులుహైదరాబాద్ : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని బాపు ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు గాంధీజీ కి నివాళులు అర్పించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఎం.పి కేశవ రావు, ఎం ఎల్ ఏ లు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు బాపు ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. కాసేపు మౌనం పాటించి మహాత్మునికి అంజలిఘటించారు.