ఎదురుకాల్పుల్లో మావో మృతి

రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. సుక్మా జిల్లాలోని చితల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం అటవీ ప్రాంతంలో డీఆర్జీ దళాలు, కోబ్రా పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు చనిపోయాడని ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. గతయేడాది డిసెంబర్ 27న సుక్మా, బీజాపూర్ జిల్లాలోని చిన్నచెంచా అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణ గ్రేహౌండ్స్ , మావోయిస్టులు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.