జాతిపితకు అసెంబ్లీ స్పీకర్ నివాళి

జాతిపితకు అసెంబ్లీ స్పీకర్ నివాళిహైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి, శాసన వ్యవహారాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ ఇన్ కౌన్సిల్ యం యస్ ప్రభాకర్ రావు గారు, లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.