ఆదర్శప్రాయుడు మహాత్మా గాంధీ : సీఎం

హైదరాబాద్​ : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్​ ఆయన సేవలను స్మరించుకున్నారు. అహింస ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన గాంధీ ఆదర్శప్రాయుడు అని సీఎం చెప్పారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన చిత్ర పటానికి సీఎం కేసీఆర్​ నివాళులర్పించారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి గాంధీ వర్ధంతిని అమరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెబుతుందని సీఎం తెలిపారు.