ఉత్కంఠ పోరులో పంజాబ్ పై లక్నో విక్టరీ 

ఉత్కంఠ పోరులో పంజాబ్ పై లక్నో విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో 154 పరుగుల టార్గెట్ ను కాపాడుకున్న లక్నో సూపర్ జెయింట్స్, తమ ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు, ఒకరిద్దరు మినహా మిగతా బ్యాట్స్ మెన్లు చేతులెత్తేయడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. చివరిలో బౌలర్లు కూడా బ్యాటు ఝులిపించడంతో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కు సరైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (25) ఫర్వాలేదనిపించినా, ధవన్ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన రాజపక్స (9) కూడా ఫెయిలయ్యాడు.ఉత్కంఠ పోరులో పంజాబ్ పై లక్నో విక్టరీ ఇక లియామ్ లివింగ్ స్టన్ (18) కాసేపు మెరుపులు మెరిపించి ఔటవడంతో పంజాబ్ ఓటమి దాదాపు ఖాయమైంది. ఐతే అప్పటికీ బెయిర్ స్టో (32) క్రీజులో ఉండటంతో గెలుపుపై పంజాబ్ కి కొద్దో గొప్పో ఆశలు మిగిలాయి. చమీర బౌలింగ్ లో అతను కూడా ఔటయ్యాడు. రబాడ (2), రాహుల్ చాహర్ (4), జితేష్ శర్మ (2) బ్యాటుతో ఏమీ సాధించలేకపోయారు. చివరిలో రిషి ధావన్ ( 21 నాటౌట్ ) పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బౌలర్లలో మొహ్ సిన్ ఖాన్ 3, చమీర 2, కృనాల్ పాండ్య 2, రవి బష్ణోయి 1 వికెట్ తీసుకున్నారు.