రోజాపై గెటప్ శ్రీను షాకింగ్ కామెంట్స్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : జబర్దస్త్ ఫ్యామిలీలో చిచ్చురేగింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మంత్రి హోదాలో మెగా బ్రదర్స్ పై చేసిన కామెంట్స్ కి జబర్దస్గ్ కమెడియన్ గెటప్ శ్రీను గట్టి కౌంటర్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవిపైన, నాగబాబు, పవన్ కల్యాణ్ లపై రోజా చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ మంత్రి రోజాపై కీలక వ్యాఖ్యలు చేశారు గెటప్ శ్రీను.
ఆయన సోషల్ మీడియాలో రాసుకోస్తూ ..’చిరంజీవి గారి సేవా గుణ, దాన గుణం తెరిచిన పుస్తకం..ఒక స్ఫూర్తి. మరి మీకెందుకు కనపడలేదో ? రోజాగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సి వస్తుందని అనుకోనేలేదు. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి ‘ అంటూ తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చాడు శ్రీను. ప్రజంట్ ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.
అయితే గెటప్ శ్రీను జబర్దస్త్ కమెడియన్ గా వందలాది స్కిట్ లు చేశారు. అప్పుడు జడ్జిగా రోజా ఉన్నారు. మంత్రి అయిన తర్వాత రోజా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనుకున్నాడో ఏమో కానీ ఎంత జబర్దస్త్ జడ్జి అయినా, తమ అభిమాన నటుడిని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నట్టుగా రోజాకి కౌంటర్ ఇచ్చాడు గెటప్ శ్రీను.
ఇక కమేడియన్ శీను ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే. గెటప్ శీను అనగానే అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా జబర్దస్త్ అనే కామెడీషో లో రకరకాల గెటప్ లు వేసి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ శీను. కాగా జబర్దస్త్ షోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శీను. ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి పొజిషన్ ఉన్నాడో మనందరికీ తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు జబర్దస్త్ కంటిన్యూ చేస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు.