సీఎం కేసీఆర్ జిల్లాల టూర్..ఎప్పుడంటే !

సీఎం కేసీఆర్ జిల్లాల టూర్..ఎప్పుడంటే !

సీఎం కేసీఆర్ జిల్లాల టూర్..ఎప్పుడంటే !

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈనెలలో మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. జనవరి 12న ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి, సమీకృత కలెక్టరేట్ కు ప్రారంభోత్సవం చేస్తారు.

సంక్రాంతి అనంతరం జనవరి 18న ఖమ్మం జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సకట సదుపాయాలతో జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తై అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి రెడీ అయ్యాయి. మరికొన్ని తుదిదశ నిర్మాణ పనులు సాగుతున్నాయి.