బల్దియా ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లు

బల్దియా ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాట్లువరంగల్ అర్బన్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయ ఆవరణలో భారతరత్న డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బల్దియా మేయర్ డా.గుండా ప్రకాశరావు తెలిపారు. విగ్రహం ఏర్పాటుకై కార్యాలయ ఆవరణలో సబ్-కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్ ఆమోదం తెలియజేయడం జరిగిందన్నారు. నవంబర్ 9న దీక్ష దివస్ ను పురస్కరించుకొని జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ఆవరణలో పైలాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, విగ్రహ ఏర్పాటు క్రమంలో పైలాన్ ను కూడా ఏర్పాటు చేస్తామని మేయర్ గుండా ప్రకాశరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు లాదేళ్ళ బాలయ్య, జోరిక రమేష్ తో పాటు సుంకరి శివ, మరుపల్ల రవి, బిల్లా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.