ములుగు జిల్లా : మేడారంలోని సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతల దర్శనం వాయిదా ను పొడిగిస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు తెలిపారు. ఆదివారం మేడారంలో లో విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి దిన దినం గండం గా మారిన తరుణంలో దర్శనం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాలు ప్రారంభ తేదీ జూన్ 8వ తారీకు ఉండగా, స్థానిక పూజారులు ఎండోమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మేడారం మన దేవతల దర్శనం, ఆదివాసీ, సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటుందని, పూజా కార్యక్రమాలు మిగతా ఆలయాలకు కంటే వేరువేరుగా ఉంటాయి కనుక వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మేడారం వనదేవతల దర్శనానికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండి ఎక్కువగా దర్శనానికి వస్తుంటారని పేర్కొన్నారు. ఎవరికి కోవిడ్19 వైరస్ పాజిటివ్ ఉందో, లేదో చెప్పలేం కాబట్టి ఈ జూన్, జులై నెలలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంటుందని, కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత అధికంగా ఉంటుందనే ఉద్దేశంతో దర్శనం వాయిదా చేస్తున్నట్లు తెలిపారు. దర్శనం లేని మేడారం ఆలయం బంద్ ఉన్న లాక్ డౌన్ ఈ సమయంలో కూడా భక్తులు వస్తున్నారని, దర్శనం ప్రారంభిస్తే ఇంకా అధికంగా వచ్చి స్థానిక ఆదివాసి గిరిజన గ్రామాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే ప్రమాదం దండం వల్ల దర్శనం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.