452 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

452 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్హైదరాబాద్ : భారతీయ స్టేట్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ బీఐలో ఖాళీగా ఉన్న మేనేజర్, స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్ లైన్ దరఖాస్తులు వచ్చే నెల 11వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 452 పోస్టులను భర్తీ చేయనుంది.

ఇందులో కొన్ని పోస్టులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది.452 పోస్టుల్లో డిప్యూటి మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్ -28, ఇంజినీర్(ఫైర్ )-16, మేనేజర్ (నెట్వర్కింగ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ )- 12, మేనేజర్ (నెట్వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్ )-20, అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్ )-40, డిప్యూటి మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్ )-60, అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్ )-183, డిప్యూటి మేనేజర్ (సిస్టమ్ ) -1, ఐటీ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్-15, ప్రాజెక్ట్ మేనేజర్-14, అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5, టెక్నికల్ లీడ్- 2, మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)-2, మేనేజర్ (మార్కెటింగ్ )-12, డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్ )-26 చొప్పున ఖాళీలు వున్నాయి.

అర్హతలు: ఎంబీఎ లేదా పీజీడీబీఎం లేదా సీఎం, కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఐటీ లేదా ఈసీఈ లేదా, ఎమ్మెస్సీ (కంప్యూటర్స్ ) లేదా ఎమ్మెస్సీ (ఐటీ), బీటెక్ లేదా బీఈ, పీజీ చేసి ఉండాలి. ఇందులో కొన్ని పోస్టులకు అనుభవం తప్పనిసరి . అదేవిధంగా అభ్యర్థులు 21 నుంచి 40 యేండ్లలోపు వయస్సు కలిగినవారై వుండాలి.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్ లేదా ఆన్లైన్ రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో

అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ‌్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు

దరఖాస్తులకు చివరి తేదీ: 2021, జనవరి11

వెబ్ సైట్ :https://bank.sbi/web/careers or https://www.sbi.co.in/web/careers