బాలీవుడ్ లోకి టాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ లోకి టాలీవుడ్ హీరోయిన్హైదరాబాద్ : ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో ఈ ఏడాది ఆరంభంలోనే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న నటి రష్మిక బావీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. యువ కథానాయకుడు సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘మిస్టర్ మజ్ను’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రష్మిక అభిమానులతో పంచుకుంది.

‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నేను కూడా ఓ భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సినిమాతో కొత్త ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది. భారత్ రా ఏజెన్సీ పాకిస్థాన్ లో చేపట్టిన అత్యంత సాహసోపేతమైన మిషన్ కథతో ‘మిస్టర్ మజ్ను’ చిత్రం తెరకెక్కుతుందని రష్మిక పేర్కొంది. షాంతను భాగ్చీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మరోవైపు కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’తో 2016లో కథానాయికగా వెండితెరకు పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని అలరించారు. 2018లో విడుదలైన ‘ఛలో’ తో ఆమె తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. అదే ఏడాదిలో విడుదలైన ‘గీత గోవిందం’, ‘దేవదాస్ ‘, 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్ ‘ చిత్రాలు రష్మికకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.