“ఈ కథలో పాత్రలు కల్పితం” టీజర్ లాంచ్​

"ఈ కథలో పాత్రలు కల్పితం" టీజర్ లాంచ్​

హైదరాబాద్​ : పవన్‌ తేజ్‌ కొణిదెలను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్​టైనర్ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌ కి, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 18న ఈ చిత్రం టీజర్ ని మెగాబ్రదర్ నాగబాబు రిలీజ్ చేసి సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కావడానికి సన్నద్ధం అవుతోంది. ‘మా చిత్ర టీజర్ రిలీజ్ చేసిన నాగబాబు గారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంటర్​టైన్​ మెంట్ జోడించి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రాన్ని రూపొందించాం. దర్శకుడు అభిరామ్ క్వాలిటీ తగ్గకుండా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. టైటిల్ కి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ‌డంతో మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెలకి పర్ఫెక్ట్ లాంచింగ్ ఫిల్మ్ అవుతుంది అని’నిర్మాత రాజేష్​నాయుడు అన్నారు. ‘ఈ సినిమాతో పవన్ తేజ్ కొణిదెల హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. నిర్మాత రాజేష్ నాయుడు సినిమాను కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా నిర్మించారు. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’ అని డైరెక్టర్​ అభిరామ్​ అన్నారు.

నటీనటులు:
పవన్‌ తేజ్‌, మేఘన,
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌. ఎన్‌, సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌, తిరు, ఫైట్స్‌: షావోలిన్‌ మల్లేష్‌, ఆర్ట్‌: నరేష్‌ బాబు తిమ్మిరి, డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్ ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సియ డిజైన‌ర్స్‌, వీఎఫ్ఎక్స్: విజువ‌ల్స్ ఫ్యాక్ట‌రీ(తిరు), ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ఎజె ఆర్ట్స్‌, (అజయ్ కుమార్), పీఆర్వో : సాయి స‌తీష్‌, ‌కో-డైరెక్టర్‌: కే శ్రీనివాస్‌ రెడ్డి,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి, నిర్మాత: రాజేష్‌ నాయుడు, క‌థ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.