భీమదేవరపల్లి బ్రాంచి టీజర్ లాంచ్ చేసిన కేటీఆర్

భీమదేవరపల్లి బ్రాంచి టీజర్ లాంచ్ చేసిన కేటీఆర్

భీమదేవరపల్లి బ్రాంచి టీజర్ లాంచ్ చేసిన కేటీఆర్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఏబీ సినిమాస్ అండ్ నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ,సుధాకర్ రెడ్డి, డా.కీర్తి లత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “భీమదేవరపల్లి బ్రాంచి ”. ఇంతకు ముందు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలే కాకుండా స్వయంగా రామ్ గోపాల్ వర్మనే తన సినిమాలో నటించమని అడిగినా నో చెప్పిన ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, మరియు సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, నాయకులు అద్దంకి దయాకర్ ఈ “భీమదేవరపల్లి బ్రాంచి”సినిమా లో యాక్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన టీజర్ ను నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.

మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “భీమదేవరపల్లి బ్రాంచి” చిత్ర టీజర్ ను చూసి చాలా ఇంప్రెస్స్ అయ్యానని మంత్రి కేటీఆర్ అన్నారు.అలాగే మంచి మెసేజ్ ఉన్న సినిమా అని అర్థం అవుతోంది. పూర్తి సినిమాను తప్పకుండా చూస్తాను “అని కేటీఆర్ అన్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న” మా “భీమదేవరపల్లి బ్రాంచి” సినిమా టీజర్ ను మంత్రి కేటీఆర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు రమేష్ చెప్పాల మంచి విషయాన్నీ కామెడీ వేలో చెప్పడం వల్ల జనాలకి ఈజీగా రీచ్ అవుతుందని చిత్ర నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తీ లత గౌడ్ అన్నారు.

నటీ నటులు :
అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, డా.కీర్తి లత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న, జేడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, అద్దంకి దయాకర్, బుర్ర శ్రీనివాస్ (B.S), శుభోదయం సుబ్బారావు, సి.ఎస్.ఆర్. వివ రెడ్డి, నర్సింహ రెడ్డి,పద్మ, మానుకోట ప్రసాద్, గడ్డం నవీన్, తాటి గీత, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, కటారి, రజిని, సుష్మా.

సాంకేతిక నిపుణులు..
బ్యానర్ : ఏబీ సినిమాస్ & నిహాల్ ప్రొడక్షన్స్
రచన-దర్శకత్వం : రమేశ్ చెప్పాల,
నిర్మాతలు : డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి,
కెమెరా : కె.చిట్టి బాబు,
సంగీతం : చరణ్ అర్జున్,
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ,
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి,
పబ్లిసిటీ డిజైనర్ : ధని ఏలే,
ఆర్ట్ : మోహన్,
పి.ఆర్.ఓ : హరీష్,దినేష్.