రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో బీజేపీ : కడియం

రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో బీజేపీ : కడియం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం వైఖరి అసమానతలను పెంచేలా ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పరోక్షంగా ఎత్తివేసే కుట్ర చేస్తుండటం సిగ్గుచేటన్నారు. హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తో కలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కులమతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతూ, ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతుందని ఆరోపించారు.రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో బీజేపీ : కడియం

కేంద్రప్రభుత్వం విద్యాసంస్థల్లో, ఫ్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీలకు 7.30 శాతం, ఎస్టీలకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది. ఇది అప్పుడున్న 14.7 శాతం ఎస్టీ, 7.5 శాతం ఎస్సీ జనాభా ప్రాతిపదికన నిర్ణయించడం జరిగిందని కడియం శ్రీహరి తెలిపారు. 1961 నుంచి 2021 వరకు అంటే దాదాపు 60 యేళ్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కేంద్రం పెంచలేదని వెల్లడించారు. పెరిగిన జనాభాకు ఆధారంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం కేంద్రానికి ఎంతైనా ఉందన్నారు. అయినా కేంద్రానికి ఉలుకు లేదు పలుకు లేదని విమర్శించారు. 2021 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ 18శాతం జనాభా, ఎస్సీ10 శాతం జనాభా ఉంది. ఆ మేరకు ఎస్టీలకు 18 శాతం, ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కడియం డిమాండ్ చేశారు. ఈ విషయంలో దళిత మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తమవ్వాలని సూచించారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ కడియం శ్రీహరి ఫుల్ ఫైర్ అయ్యారు. దేశంలో మోడీ కులమతాల మధ్య చిచ్చు పెడుతుంటే, కేసీఆర్ మాత్రం తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు పెద్ద పీట వేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళితబంధు, గిరిజన బంధు అమలు చేస్తున్నామని ధీమాగా వ్యక్తం చేశారు. తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా దళిత, గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.