ఘనంగా నిహారిక కల్యాణ వైభోగం

ఘనంగా నిహారిక కల్యాణ వైభోగంరాజస్థాన్: నటుడు నాగబాబు లవ్లీ డాటర్ నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ జొన్నలగడ్డ చైతన్య ని‌హారిక మెడలో మూడు ముళ‌లు వేసి, ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో గల ఉదయ్ విలాస్ లో పూలు, తోరణాలతో అందంగా అలంకరించిన మండపంలో నిహారిక-చైతన్యలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి కుమార్తె నిహారిక ముహూర్తం వేళ బంగారు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లి వేడుకలో కొణిదెల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా నిహారిక తండ్రి నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. తన కుమార్తె మొదటి రోజు పాఠశాలకు వెళ్తున్నట్లు అనిపిస్తోందని, కానీ ఆమె సాయంత్రం తిరిగి ఇంటికి రాదు.. అని నా చిన్నారి ఎదిగి, పాఠశాలకు వెళ‌్తున్నప్పుడు ఆమెతో రోజులో 24 గంటలు ఆడుకోలేనని నా మనసుకు చెప్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సారి ఎంత కాలం పడుతుందో చూడాలి. దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా నిహారిక తల్లి అంటూ నాగబాబు పెళ్లి ఫోటో షేర్ చేశారు.

ఘనంగా నిహారిక కల్యాణ వైభోగం