ఎన్ హెచ్ 65 పై తగలబడిన లారీ

యాదాద్రి భువనగిరి జిల్లా : జాతీయ రహదారి ఎన్ .హెచ్ 65 పై ఓ లారీ తగలబడింది. చౌటుప్పల్ మండలం మల్కాపురం దగ్గర హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న లారీకి ప్రమాదవత్తు మంటలంటుకున్నాయి. మల్కాపురం దగ్గర గడ్డి మోపుతో వెళ్తున్న టీవీఎస్ లూనాను లారీని ఢీకొట్టడంతో లూనాతో సహా ఆ వ్యక్తి లారీ కింద పడ్డాడు. దీంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగిపడుతుండటంతో లారీ డ్రైవర్ , క్లీనర్ వెంటనే లారీ నుంచి దూకారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారునికి తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.