మానుకోటలో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్  

మానుకోటలో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్

వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మానుకోటలో పార్టీ ఆఫీస్ ప్రారంభించిన కేసీఆర్  పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రాజయ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకుముందు మహబూబాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు.