చైనా మాంజా అమ్మితే.. డేంజర్ లో పడ్డట్లే..

చైనా మాంజా అమ్మితే.. డేంజర్ లో పడ్డట్లే..

చైనా మాంజా అమ్మితే.. డేంజర్ లో పడ్డట్లే..

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా రవాణా చేసినా 5 యేళ్లు జైలు శిక్ష, రూ. 1లక్ష జరిమానా విధిస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ( పీసీసీఎఫ్) డోబ్రియాల్ హెచ్చరించారు. వీటి విక్రయాలు జరుగకుండా 5 ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని, చైనా మాంజాను రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై బుధవారం హైదరాబాద్ అరణ్య భవన్ లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

చైనా మాంజా వినియోగించడం వల్ల మనుషులు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 యేళ్లు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని డోబ్రియాల్ అన్నారు. పతంగులతో పాటు పక్షులను ఎగరనిద్దాం అన్న నినాదంతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సూచించారు. చైనా మాంజాలకు బదులు సంప్రదాయ కాటన్ దారాలు ఉపయోగించాలని అన్నారు. ఎక్కడైనా చైనా మాంజాలు విక్రయిస్తన్నట్లు తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్లు 040- 23231440, 18004255364 కు సమాచారం ఇవ్వాలని పీసీసీఎఫ్ డోబ్రియాల్ కోరారు.