ఆస్తులను తాకట్టు పెట్టి పేదలకు సాయం

ఆస్తులను తాకట్టు పెట్టి పేదలకు సాయంలాక్ డౌన్ నేపథ‌్యంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వేలాది మంది నిరాశ్రయులకు సోనూసూద్ అండగా నిలిచాడు. వేలాది మంది నిరాశ్రయులను తమ సొంతూళ్లకు చేర్చడమే కాకుండా , వారి అవసరాలను దగ్గరుండి తీర్చాడు. ఆపదవుందని తెలిస్తే చాలు వారికి ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఇదంతా ఎందుకంటే వారసత్వపు ఆస్తులతో ఎంజాయి చేస్తూ పేదలకు సాయం చేయని వారు ఎంతో మంది వున్నారు. కానీ సోనూ సూద్ మాత్రం తాను సొంతంగా సంపాదించిన డబ్బుతోనే పేదలకు సాయం చేయడం గొప్ప విశేషం.