తెలంగాణలో మళ్లీ మొదలుకానున్న ఆన్లైన్ క్లాసులు !

తెలంగాణలో మళ్లీ మొదలుకానున్న ఆన్లైన్ క్లాసులు !హైదరాబాద్ : తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొదట్లో వెయ్యిలోపు నమోదైన కరోనా కేసులు ఇప్పుడు 25వందలకు పైగా నమోదవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ పేరుతో జనవరి 8 నుంచి 16 వరకు హాలిడేస్ ప్రకటించింది తెలంగాణ సర్కార్ . అయితే కరోనా కేసుల తీవ్రత తెలంగాణలో ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్కూల్ హాలిడేస్ పెంచాలని ఇప్పటికే కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయింది.

అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాధికారులు, ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించినట్లు తెలుస్తోంది. ఇక రేపు దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. గత సంవత్సరం నుంచి తెలంగాణలో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్లైన్ క్లాసులు కారణంగా విద్యార్థులు చాలా నష్టపోతున్నారు.