పతంగి కోసం పోల్ ఎక్కిన బాలుడు..ఆపై ఏంజరిగింది.. !

పతంగి కోసం పోల్ ఎక్కిన బాలుడు..ఆపై ఏంజరిగింది.. !ములుగు జిల్లా : ములుగులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ గాలిపటం 12 యేళ్ల కుర్రాడి ప్రాణాలకు ప్రమాదాన్ని తీసుకువచ్చింది. గాలి పటం ఎగురవేస్తుండగా, కరెంట్ పోల్ తీగలకు చిక్కింది. అయితే గాలి పటాన్ని తీసుకునేందుకు ఆ బాలుడు కరెంట్ పోల్ ఎక్కాడు. కరెంట్ తీగల నుంచి గాలిపటం తీసే క్రమంలో దురదృష్టవశాత్తు ఆ బాలుడు విద్యుత్ షాక్ కి గురయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన లైన్మెన్ అప్రమత్తతతో విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. దీంతో ఆ బాలుడికి పెద్ద ప్రమాదం తప్పింది. అయినప్పటికీ ఆబాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కరెంట్ పోల్ నుంచి ఆ బాలున్ని కిందికి దింపిన లైన్మెన్, స్థానికులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.