బీజేపీ కార్యకర్తలతో ప్రధాని కీలక భేటీ

బీజేపీ కార్యకర్తలతో ప్రధాని కీలక భేటీ

న్యూఢిల్లీ : బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈనెల 18న మోడీ, పార్టీ కార్యకర్తలతో సమావేశంకానున్నారు. జనవరి 18న ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ‘ మీ ఆలోచనలు మరియు సూచనలు పంచుకోండి. సలహాలను, సూచనలను NAMOయాప్ ద్వారా లేదా 1800 2090 కి డయల్ చేయండి అంటూ బీజేపీ, ఉత్తరప్రదేశ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ రోజు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ , పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. 7 విడతల్లో 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాస్ట్రంలోని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది. గెలుపు కోసం కష్టపడాలంటూ ప్రధాని దిశా నిర్ధేశం చేసే అవకాశం ఉంది.