నెల్లూరు జిల్లా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పీఎస్‌ఎల్‌వీ – సీ50 ని అంతరిక్షంలోకి పంపేందుకు కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. ఈ నెల 17 ను మహూర్తంగా నిర్ణయించింది. అత్యాధునిక సాంకేతిక సమాచారాన్ని సత్వరం అందుబాటులోకి తెచ్చేందకు ఇస్రో సాగించే నిరంతర ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి 17న సాయంత్రం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది.. 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు ఇస్రో అధికారులు. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో (వ్యాబ్) రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో బుధవారం విడుదల చేసింది. గురువారం పీఎస్‌ఎల్‌వీ – సీ50ను అంతరిక్షంలో పంపేందుకు కౌంట్‌డౌన్ స్టార్టయింది.