వైభవంగా రానా- మిహీకా వివాహం

వైభవంగా రానా- మిహీకా వివాహంహైదరాబాద్‌: సినీ నటుడు రానా దగ్గుబాటి వివాహం వైభవంగా జరిగింది. వధువు మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు, కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయటపెట్టాడు. వైభవంగా రానా- మిహీకా వివాహంమిహీకా బజాజ్‌ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి అంగీకరించాయి. దీంతో శనివారం రాత్రి 8.30 గంటలకు సుమూహుర్త సమయంలో రానా-మిహీకా ఒక్కటయ్యారు.వైభవంగా రానా- మిహీకా వివాహం