హైదరాబాద్: మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్, ప్రిన్స్ ఛార్మింగ్, డెడికేషనల్ హీరో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేష్‌కి అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షల వెల్లువ కురుస్తుంది. నెల రోజుల ముందు నుండే సోషల్ మీడియాలో మహేష్ బర్త్‌డే హంగామా మొదలు కాగా, ఆయన బర్త్‌డేకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ నటుడిగానే కాకుండా మానవతావాదిగా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తంగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. నేడు తన బర్త్‌డే సందర్భంగా మహేష్ ప్లాస్మా దానం చేయాలంటూ అభిమానులతో పాటు ప్రజలకి పిలుపునిచ్చారు.
బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అతడు, పోకిరి, బిజినెస్ మెన్, దూకుడు ఇలా పలు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన మహేష్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంకి సంబంధించిన పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, ఈ రోజు మహేష్ బర్త్‌డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ కాయిన్‌ని గాల్లోకి ఎగిరివేయడాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. చేతికి ఓం అనే లాకెట్ కూడా టీజర్‌లో గమనించవచ్చు. ఈ సినిమాలో ముఖ్యంగా అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ నటిస్తుందని సమాచారం.