గంటలో పెళ్లి పెట్టుకుని ఆ పెళ్లి కొడుకు..!

గంటలో పెళ్లి పెట్టుకుని ఆ పెళ్లి కొడుకు..!మహబూబాబాద్ జిల్లా: గంటలో పెళ్లి పెట్టుకుని ఆ పెళ్లి కొడుకు అదే సమయానికి చనిపోవడం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు పెళ్లి ఉండగా రాత్రి 10 గంటలకు పెళ్లి కుమారుడు చనిపోయాడు. వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం అలముకుంది. వివరాల్లోకి వెళితే ..మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతుల కుమారుడు నరేష్ (25). ఇతనికి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం కుదిరింది. 8వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందే వరుడు నరేష్ తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు.ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వరుడు ఆ నిద్రలోనే చనిపోయాడు. పడుకున్న వరుడు లేవకపోవడంతో మళ్లీ వైద్యుడ్ని పిలిచి పరీక్షించారు. కానీ అప్పటికే వరుడు చనిపోయాడని ధ్రువీకరించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద చాయలు అలముకున్నాయి.