వరంగల్ లో యూత్ కాంగ్రెస్ నాయకుల వర్గపోరు

వరంగల్: జాతీయ యువజన కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా వ‌రంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ డిసిసి భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వరంగల్ లో యూత్ కాంగ్రెస్ నాయకుల వర్గపోరుఅనంతరం కాంగ్రెస్ యువజన దినోత్సవం సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ గురించి పలు అంశాలు మాట్లాడి వెళ్ళారు. అనంతరం డిసిసి భవన్ నుంచి తిరుగుముఖం పట్టిన యువజన కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు బయటపడింది. నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రేస్ కమిటీ నగర అధ్యక్షులు కట్ల శ్రీనివాస్ వర్గీయులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య బాహాబాహి కొనసాగింది. ఇరువర్గాల మధ్య గొడవలో ఒకరి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల యువజన నాయకులు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే యువజన కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన గొడవ విషయంలో మాత్రం డిసిసి అధ్యక్షులు నాయిని రాజెందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్ లు మాత్రం అది వర్గ పోరు కాదని, వారి వ్యక్తిగత కారణాల వల్లనే గొడవలు జరిగాయని తెలిపారు.