తెలంగాణలో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,982 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 12 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 79,495కు చేరగా, మరణాల సంఖ్య 627కు చేరింది. ఇప్పటి వరకు 55,999 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 22,869 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్‌ పరిధిలో 463 పాజిటివ్‌ కేసులు, మేడ్చల్‌లో 141, రంగారెడ్డిలో 139, కరీంనగర్‌లో 96, జోగులాంబ గద్వాలలో 93, జనగామలో 78, పెద్దపల్లిలో 71, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.