ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘సలార్’

ప్యాన్ ఇండియా ‌స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ నిర్మాణంలో రూపొందనున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘సలార్’ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘సలార్’హైద‌రాబాద్‌: భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి ద‌క్షిణాది సినీ పరిశ్ర‌మ‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల‌నే ఉన్న‌తాశ‌యంతో ప్రారంభమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా నిర్మాణ సంస్థగా మారింది. ఈ బ్యానర్‌లో రాకింగ్‌స్టార్ య‌ష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేసిన భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ప్యాన్‌ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మ‌రో ప్యాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా విడుద‌ల గురించి ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు హోంబ‌లే ఫిలింస్ అధినేత విజయ్‌ కిరగందూర్…ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తన బ్యానర్‌లో మూడో ప్యాన్ ఇండియా మూవీగా .‘సలార్’ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది.